- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gujarat: జీరా సోడా తాగి ముగ్గురు మృతి! గుజరాత్‌లో షాకింగ్ ఘటన

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు స్థానికంగా జీరా సోడా (jeera soda) తాగి అరగంటలో మరణించారని కలకలం రేపుతోంది. పోలీసుల ప్రకారం.. గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. మృతిచెందిన వారిలో యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించారు. అనంతరం వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపు వారు కన్నుమూశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ప్రస్తుతానికి, బాటిళ్లలో ఏముందో మాకు ఖచ్చితంగా తెలియదని ఖేడా పోలీసు అధికారి రాజేశ్ గాధియా మీడియాతో మాట్లాడారు. ఇక ప్రారంభ విచారణలో మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షలు తేల్చాయి. పోలీసుల పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఘటనపై మరింత క్లారిటీ రానుంది.
ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్‌లో గతంలో జరిగిన విషపూరిత మద్యం ఘటనలను గుర్తుచేస్తుంది. డిసెంబర్ 2023లో మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఆయుర్వేద సిరప్ తాగి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 2022 లో అహ్మదాబాద్, బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 42 మంది కన్నుమూశారు.