ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను ఖండించిన ప్రధాని మోడీ

by Prasanna |   ( Updated:2023-11-17 08:17:39.0  )
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను ఖండించిన ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలను కోల్పోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. అలాగే, పశ్చిమాసియాలో పెరుగుతున్న సవాళ్ల మధ్య గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఐక్యత, సహకారానికి ఉన్న ప్రాధాన్యతను మోడీ ప్రస్తావించారు. శుక్రవారం జరిగిన వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని, సంప్రదింపులు, దౌత్యమార్గాంలోనే సమస్యలను పరిష్కరించాలని భారత్ భావిస్తుంది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధలో సాధారణ పౌరలు ప్రాణాలను కోల్పోవడంపై భారత్ ఎప్పుడూ వ్యతిరేకమే' అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నప్పటికీ భారత్ ఎంతో సంయమనంతో వ్యవహరించినట్టు మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని వివిధ స్థాయిల ఆర్థిక అభివృద్ధితో ఉన్న దేశాల సమూహాన్ని సూచిస్తుంది. ఈ దేశాలు ఒకే విధమైన లక్షణాలతో లేనప్పటికీ, అవి తరచుగా పేదరికం, అసమానత, తక్కువ వనరులు వంటి సాధారణ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మందరి ప్రాధాన్యతలు మారాలి. సంప్రదింపులు, సంభాషణలు, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల అనే ఐదు సూత్రాల ద్వారా సహకారం అందించుకోవాలన్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అంతర్జాతీయంగా దక్షిణ, ఉత్తర దేశాల మధ్య దూరాన్ని పెంచకూడదని మోడీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed