Sunita Williams: ఇది నాకు సంతోషకరమైన ప్రదేశం.. ఇక్కడ ఉండటం ఇష్టం

by Shamantha N |
Sunita Williams: ఇది నాకు సంతోషకరమైన ప్రదేశం.. ఇక్కడ ఉండటం ఇష్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(International Space Station) చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్‌ (Sunita Williams), బుచ్‌ విల్‌మోర్‌(Butch Wilmore) ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం స్పేస్ స్టేషన్ లో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ.. ‘‘ స్టార్ లైనర్ టెస్ట్ పైలట్స్ తిరిగి రావడానికి ఆలస్యం అవుతుందని తెలుసు కానీ.. దాదాపు ఏడాది పాటు స్పేస్ లోనే ఉంటారని ఊహించలేదన్నారు. కొన్నికొన్నిసార్లు ఇలానే జరుగుతోంది. ఇది నా సంతోషకరమైన ప్రదేశం. నాకు ఇక్కడ అంతరిక్షంలో ఉండటం చాలా ఇష్టం’’ అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులను మిస్‌ అవుతున్నప్పటికీ.. ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయడం లేదని విల్‌మోర్ వ్యాఖ్యానించారు.

అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న ఆస్ట్రోనాట్స్

ఇకపోతే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకంటున్నారు. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. సునీతా, విల్ మోర్ స్పేస్ నుంచే ఓటు వేయాలనుకుంటున్నారు. అమెరికా పౌరురాలిగా ఓటు వేయడం తన బాధ్యత అని సునితా చెప్పుకొచ్చారు. ఓటు వేసేందుకు బ్యాలెట్ పేపర్ల కోసం అభ్యర్థన పంపామని మరో ఆస్ట్రోనాట్ విల్ మోర్ అన్నారు. మిషన్ కొనసాగుతున్నప్పుడు కూడా పౌర విధులు నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను ఇద్దరూ నొక్కి చెప్పారు

జూన్ లో స్పేస్ స్టేషన్ లోకి..

బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌లో భాగంగా నాసా (NASA) ఈ ఏడాది జూన్‌లో ఇద్దరు వ్యోమగాములను స్పేస్ లోకి పంపంది. పది రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ ఈ స్టార్‌లైనర్‌ జూన్‌ 5న స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌ (Boeing Starliner) స్పేస్ షిప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీన్ని సరిచేసే క్రమంలో ఆస్ట్రోనాట్స్ భూమికి తిరిగి రావడం ఆలస్యం అవుతూ వచ్చింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్‌.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్‌ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్‌ న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో సురక్షితంగా కిందకు దిగింది.

Advertisement

Next Story

Most Viewed