బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతల యత్నం

by karthikeya |
బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతల యత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ (BJP) కార్యాలయ ముట్టడికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు (Telangana Congress Women Wing Leaders) ప్రయత్నించడంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. కాగా.. ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ (Gandhi Bhavan) వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ మహిళా నేతలు ఏకంగా నాంపల్లి (Nampally)లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు (Police) అడ్డగించారు. దీంతో బీజేపీ ఆఫీస్ ఎదుటే కాంగ్రెస్ మహిళా నేతల బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ (Apologies) చెప్పాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story