Tirumala News: శ్రీవారి సేవలో సినీ నటులు

by Jakkula Mamatha |
Tirumala News: శ్రీవారి సేవలో సినీ నటులు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శ్రీవారిని సినీ నటి సంయుక్త మీనన్(Samyukta Menon), పూరీ జగన్నాథ్(Puri Jagannath) తనయుడు ఆకాష్ దర్శించుకున్నారు. విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే సింగర్ మంగ్లీ(Singer Mangli) కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంయుక్త మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి వస్తే తెలియని ఎనర్జీ వస్తుందన్నారు. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు చేస్తున్నట్లు సంయుక్త మీనన్ వెల్లడించారు.

Next Story

Most Viewed