- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ షురూ.. కమిషన్ ఎదుట కీలక అధికారి!

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును విచారించింది. ఇవాళ హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు ఎలా సమకూర్చారు? ఆదాయాన్ని ఎలా జనరేట్ చేయాలనుకున్నారు? డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా? అని పీసీ ఘోష్ కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. దీనికి రామకృష్ణారావు బదులిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. నిబంధనలు పాటించలేదని కమిషన్ ప్రశ్నించింది.
పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. కాగా, కమిషన్‌కు ఆయన ఇప్పటికే అఫిడవిట్ సమర్పించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన అంశాలు, బ్యారేజీల పనులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కమిషన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. కాగ్ నివేదిక, అఫిడవిట్ ఆధారంగా బిల్లుల చెల్లింపులు, తదితర అంశాలపై ఆయన్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.