‘ఇది చాలా పవిత్రమైన రోజు’.. ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
‘ఇది చాలా పవిత్రమైన రోజు’.. ప్రధాని మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నేరవేర్చే దిశగా ముందుకు సాగుతామని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం నుండి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ పార్లమెంట్ బయట మీడియతో మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ సమావేశమవుతోందని.. ఇది చాలా ప్రవిత్రమైన రోజు అని అన్నారు. నూతన ఎంపీలకు స్వాగతం చెప్పిన మోడీ.. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుదామని సూచించారు. మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకుని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజలు మా విధానాలను విశ్వసించారని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటీకి 50 ఏళ్లు పూర్తవుతాయని, భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అని మోడీ అభివర్ణించారు. 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకుడదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని కోరారు. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. మూడోసారి అధికారంలోకి రావటంతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

Advertisement

Next Story