- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టికెట్లు కొంటారు కానీ రైలు మాత్రం ఎక్కరు.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రైల్లో ప్రయాణం చేయాలంటే టికెట్స్ తీసుకుంటాం. కొంత మంది అయితే అసలు టికెట్స్ తీసుకోకుండా దొంగతనంగా రైలు ప్రయాణం చేస్తారు. కానీ.. అసలు రైలు ఎక్కకపోయినా కూడా కొంత మంది టికెట్స్ తీసుకుంటున్నారు. ఈ విచిత్ర సంఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ప్రయాగ్‌రాజ్‌లోని దయాల్‌పుర్ గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్‌ను 2006 లో ఆదాయం లేని కారణంగా మూసి వేశారు. అక్కడ ప్రజలు పోరాటం చేసి 2022లో తిరిగి స్టేషన్‌ను ప్రారంభించుకున్నారు. అయితే ప్రారంభంలో కొన్ని నెలలు బాగానే అమ్ముడైన టికెట్లు మళ్లీ తగ్గాయి. దీంతో ఆదాయం తగ్గితే స్టేషన్‌ను మూసివేస్తే.. తిరిగి తెరిపించుకోవడం కష్టం అవుతుందనే ఆందోళన చెందిన గ్రామస్థులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అదే వారు ప్రయాణాలు చేయకున్న స్టేషన్ ఆదాయం తగ్గకూడదు అనే ఉద్దేశ్యంతో టికెట్లు కొంటున్నారు. కానీ.. ప్రయాణం మాత్రం చేయరు.