- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర హోంశాఖ నిషేధించిన సంస్థలు ఇవే
దిశ డైనమిక్ బ్యూరో: దేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కేంద్ర హోంశాఖ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో చట్టానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలపై నిషేధం వేటు వేసింది. కాగా కేంద్ర హోంశాఖ నిషేధించిన సంస్థల గురించి చూస్తే.. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ అఫ్ ఇండియా (SIMI) భారత దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు రూపొందిన సంస్థ సిమి.
ఈ నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని సిమి పై నిషేధాన్ని పొడిగిస్తూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం ప్రకారం 1 ఫిబ్రవరి 2019 నుండి మరో ఐదేళ్ల పాటు సిమిపై నిషేధాన్ని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ గడువు ముగియడంతో సిమి పై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఇక దేశంలో ఓ భాగమైన అస్సాంను స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఏర్పాటు చెయ్యాలని కాంక్షిస్తూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అఫ్ అస్సాం (ULFA) అనే సంస్థ ఏర్పడింది. అయితే దేశంలో ఎలాంటి మారణహోమం చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా భారత ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పలాడాడుతున్న ఈ సంస్థ పై నిషేద్దని విధించింది. ఇలా దేశంలో మారణహోమానికి తావిచ్చే మొత్తం 17 సంస్థలను కేంద్ర హోంశాఖ నిషేధించింది.
నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అఫ్ బోడోలాండ్ (NDFB), అల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF), నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అఫ్ త్రిపుర (NLFT), హైన్నివ్ట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ (HNLC), లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఖప్లాంగ్) [NSCN (K)],ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (IRF), జమాతే ఇస్లామీ (JeI), జమ్మూ మరియు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (మొహమ్మద్.
యాసిన్ మాలిక్ వర్గం), న్యాయం కోసం సిక్కులు (SFJ), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO), దాని అనుమబంధ సంస్థలు నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ మరియు రిహాబ్ ఫౌండేషన్.
కేరళ,జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ (JKDFP),ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)/ (MLJK-MA),తెహ్రీక్-ఎ-హురియత్, జమ్మూ మరియు కాశ్మీర్ (TeH) సంస్థలతో పాటుగా అతి శక్తివంతమైన తీవ్రవాద సంస్థలు అయినటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), దానికి అండగా ఉన్న రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), దానికి సాయంగా ఉన్న మణిపూర్ పీపుల్స్ ఆర్మీ (MPA), పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ అఫ్ కాంగ్లీపాక్(PREPAK), రెడ్ ఆర్మీ, కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP), కాంగ్లీ యోల్ కాంబ లూప్ (KYKL), కోఆర్డినేషన్ కమిటీ (CorCom), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ కాంగ్లీపాక్ (ASUK) కలిపి మొత్తం 17 సంస్థలపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది.