ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఎటువంటి రూల్స్ ఉండవు: విదేశాంగ మంత్రి జైశంకర్

by samatah |
ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఎటువంటి రూల్స్ ఉండవు: విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: సీమాంతర ఉగ్రవాదంపై ప్రతిస్పందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం ఇవ్వడానికి ఎటువంటి రూల్స్ ఉండవని తెలిపారు. మహారాష్ట్రలోని పూణెలో యువకులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని తేల్చి చెప్పారు. 26/11ముంబై దాడుల తర్వాత భారత్ స్పందించకూడదని భావించే ఒక్క వ్యక్తి కూడా లేడని తెలిపారు. ఈ దాడులకు ప్రతి స్పందించాలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారని కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం చర్చల్లో నిమగ్నమైందని చెప్పారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రతిఘటించకపోతే తదుపరి దాడులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 2014 నుంచే దేశ విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మార్పు వచ్చిందన్నారు. ఇది ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు. ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. చర్చలకు పిలుపునిస్తే దానిని అంగీకరించబోమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed