- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన పార్లమెంట్ ముందు హైటెన్షన్.. పోలీసుల అదుపులో భారత మహిళా రెజ్లర్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరనస ఉద్రిక్తంగా మారింది. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్ ఫోగట్, సాక్షిమాలిక్, బజరంగ్ పూనియా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగట్, ఆమె బంధువు, సోదరి సంగీతా ఫోగట్ బారికేడ్లను దాటి పార్లమెంట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఒకరునొకరు తోసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు. ఇదిలావుండగా, రెజ్లర్ సాక్షి మాలిక్‌ను పోలీసులు బలవంతంగా నిర్బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భజరంగ్ పూనియా సహా ఇతర రెజ్లర్లు పోలీసు అధికారుల నుంచి ఆమెను విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ నిరసనల మధ్య ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.