- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేస్తేనే ఎన్నికల విధులకు వస్తా.. కలెక్టర్‌కు చెప్పేసిన టీచర్
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి అనేది మనిషిపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటనే ఓ ఉదాహరణ. ఎన్నికల విధులకు హాజరుకావాలని కోరిన కలెక్టర్‌కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. తనకు పెళ్లి చేయడంతోపాటు కట్నం, ప్లాట్ ఇవ్వాలని కోరి వార్తల్లో నిలిచాడు. మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సాత్నా జిల్లాకు చెందిన అఖిలేశ్ కుమార్ మిశ్రా (35) సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున అక్టోబర్ 16, 17 తేదీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే అఖిలేశ్ కుమార్ మిశ్రా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శిక్షణకు హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ ఇవ్వాలంటే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్‌పై అక్టోజర్ 31న స్పందించిన అఖిలేశ్ కుమార్ మిశ్రా.. ‘‘ఇప్పటికే నాకు 35 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా పెళ్లి కాలేదు. బ్యాచిలర్‌గా ఉండలేకపోతున్న. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయమేస్తోంది. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తాను. అలాగే పెళ్లికి మూడున్నర లక్షల కట్నం, తను ఉంటున్న ప్రాంతంలో ఓ ప్లాట్ ఇవ్వాలని’’ షోకాజ్ నోటీస్‌కు రిప్లై ఇచ్చాడు.
ఈ వివరణ చూసి సీరియస్ అయిన కలెక్టర్ అఖిలేశ్ కుమార్ మిశ్రాను సస్పెండ్ చేస్తూ నవంబర్ 2న ఉత్తర్వులు ఇచ్చారు. ఆ కాపీని వాట్సాప్‌లో సెండ్ చేశారు. కానీ ఫోన్ వాడని అఖిలేశ్ కుమార్ మిశ్రా.. ఆ మెసేజ్‌ను కూడా చూసుకోలేదు. తోటి ఉద్యోగి చెప్పడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అఖిలేశ్ కుమార్ మిశ్రా.. పెళ్లికాలేదనే ఒత్తిడికి గురవుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని, ఆ డిప్రెషన్‌లోనే ఇలా తిక్క సమాధానం ఇచ్చాడని సహ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.