నీట్-యూజీకి సంబంధించిన పిటిషన్లను గురువారం విచారించనున్న సుప్రీంకోర్టు

by Harish |   ( Updated:2024-07-17 14:24:01.0  )
నీట్-యూజీకి సంబంధించిన పిటిషన్లను గురువారం విచారించనున్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024 దేశవ్యాప్తంగా పెద్ద వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌టీఏ దాఖలు చేసిన వాటితో సహా 40కి పైగా పిటిషన్‌లను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్‌లు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది.

జులై 11నే ఈ పిటిషన్లపై విచారించాల్సి ఉండగా, కొంతమంది పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎన్టీయే దాఖలు చేసిన అఫిడవిట్లను అందుకోలేదని, వాటి పరిశీలన నిమిత్తం సమయం ఇస్తూ విచారణను జులై 18కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను గురువారం విచారిస్తుంది.

మరోవైపు పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తన నివేదికను కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పేపర్ లీక్ బీహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితం అయిందని విస్తృతంగా వ్యాప్తి చెందలేదని పేర్కొంది. కేంద్రం కూడా 2024-25 సంవత్సరానికి గానూ కౌన్సిలింగ్ ప్రక్రియను జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు‌లో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా నీట్-యూజీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు తమ సీట్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో ఉంచాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సూచించింది. జులై 20లోగా వివరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సంస్థలను కోరింది. సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలయ్యే సమయంలోగా సీట్ల వివరాలను సైట్‌లో ఉంచడం ద్వారా షెడ్యూల్‌ ప్రకారం, సీట్ల కేటాయింపు వీలైనంత త్వరగా పూర్తవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ఆధారంగా, తమిళనాడు ప్రభుత్వ వైద్య సంస్థల్లో అత్యధికంగా 5,275 MBBS సీట్లు ఉన్నాయి, తరువాత మహారాష్ట్రలో 5,125 సీట్లు ఉన్నాయి. మొత్తంగా, భారతదేశంలో 1,08,940 MBBS సీట్లు ఉన్నాయి

Advertisement

Next Story

Most Viewed