ముఖేశ్‌ అంబానీ సిక్రేట్‌ లైఫ్‌..బిజినెస్‌లోనే కాదండోయ్ రొమాన్స్‌లోనూ కుభేరుడే!

by Disha Web Desk 18 |
ముఖేశ్‌ అంబానీ సిక్రేట్‌ లైఫ్‌..బిజినెస్‌లోనే కాదండోయ్ రొమాన్స్‌లోనూ కుభేరుడే!
X

దిశ,వెబ్‌డెస్క్:భారతదేశపు అత్యంత సంపన్న పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ముఖేష్ అంబానీ అనగానే అందరికీ ఆయన అత్యంత సంపన్నుడు, అపరకుభేరుడు అని అనుకుంటారు. కానీ ఆయన సీక్రెట్ లైఫ్ గురించి ఎవరికీ అంతగా తెలియదు. ఆయన బిజినెస్ చేయడంలోనే కాదు, రొమాంటిక్ పండించడంలో కూడా కుభేరుడేనంట. ఇక ఆయన లైఫ్‌లోని ప్రేమాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. వీరు చాలా అన్యోన్య దంపతులు. ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరిది లవ్ మ్యారేజ్. ముఖేష్ అంబానీ నీతా అంబానీని చాలా కష్టాలు పడి ప్రేమలో పడేశాడంట. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ ఓ కాలేజీలో జరిగిన ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో నీతాను మొదటిసారి చూశారు. ఆయన నీతాను చూసినప్పటి నుంచి ఆమెను తన కుటుంబానికి కోడలిగా చేసుకోవాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారంట.

అప్పటినుంచి నీతాను కాంటెక్ట్‌ అయ్యేందుకు చాలా ప్రయత్నించారు. నీతా ఇంటి ఫోన్‌ నంబర్‌ తెలుసుకొని ధీరుబాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని చెప్పగా.. నేను ఎలిజబెత్ టేలర్ అంటూ ఫోన్ పెట్టేశారట. ఆ తర్వాత ఆమె తండ్రి ఫోన్ తీయడంతో, ఇరు కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకున్నారు. ఆ పరిచయంలోనే ముఖేశ్,నీతా అంబానీ ప్రేమలో పడ్డారు. ప్రపోజ్ చేసుకున్నారు. అయితే తర్వాత ఒకరోజు వీరు ముంబై పెడ్డార్ రోడ్డులో కారులో వెళ్తున్న సమయంలో ముఖేష్ సడెన్‌గా కారు ఆపి, నన్ను పెళ్లి చేసుకుంటావా నీతా అని అడిగారంట. ఇద్దరు కారులోనే ఉన్నారు. చుట్టుపక్కల కార్ల హార్‌న్స్, అరుపులు వీరికి ఏం వినపడటం లేదు, నీతా ఒకే చెప్పిందంట, చూసే సరికి ఫుల్ ట్రాఫిక్ జామ్. అప్పుడు కారు తీశారంట వీరు. తర్వాత సంవత్సరం పాటు ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకున్నారంట.

Next Story

Most Viewed