ఖైదీని షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లిన పోలీసులు..( వీడియో)

by Hamsa |
ఖైదీని షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లిన పోలీసులు..( వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: నేరాలకు పాల్పడిన ఖైదీలను జైల్లో ఉంచి శిక్షిస్తారు. కానీ, ఒక ఖైదీని షాపింగ్ మాల్‌కు తీసుకెళ్ళిన ఘటనలు ఎక్కడ చూసి ఉండరు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో స్వయంగా పోలీసులే ఓ నేరస్థుడిని షాపింగ్‌కు తీసుకెళ్లారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తర ప్రదేశ్‌లో రిషబ్ రాయ్ అనే వ్యక్తి అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్నాడు. అయితే రిషబ్‌కు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరాడు. అతడి దరఖాస్తును పరిశీలించిన కోర్టు రిషబ్‌కు అనుమతిని మంజూరు చేసింది. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత స్టేషన్‌కు తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు షాపింగ్ మాల్‌కు వెళ్తూ ఖైదీని కూడా తీసుకెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఆ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story