నడిరోడ్డుపై అశ్లీలం.. ఇద్దరు యువతుల ఆటకట్టు

by Hajipasha |   ( Updated:2024-04-05 11:23:23.0  )
నడిరోడ్డుపై అశ్లీలం.. ఇద్దరు యువతుల ఆటకట్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో హోలీ పండుగ వేళ జనం చూస్తుండగా పట్టపగలు అశ్లీలంగా ప్రవర్తించిన ముగ్గురి ఆటకట్టయింది. వారిని అదే నగరానికి చెందిన వినీత, ప్రీతి, పీయూష్‌లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల హోలీ పండుగ రోజున మెట్రో ట్రైన్‌లో తోటి ప్రయాణికులు చూస్తుండగా.. వినీత, ప్రీతి ఒకరిపై ఒకరు పడుకొని అశ్లీలంగా ప్రవర్తించారు. మూవీ సాంగ్స్‌కు డ్యాన్స్ వేశారు. హోలీ రోజున వీళ్ల ఆగడాలు నోయిడా రోడ్లపైనా కంటిన్యూ అయ్యాయి. పీయూష్‌ అనే యువకుడు స్కూటరును నడుపుతుండగా.. వెనుక కూర్చున్న వినీత, ప్రీతి అశ్లీలంగా, అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుష్ట చేష్టలన్నీ వీడియోలు తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడినందుకు వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు నోయిడా పోలీసులు కూడా స్పందించారు. ఈ ముగ్గురినినోయిడాకు చెందిన వినీత, ప్రీతి, పీయూష్‌లుగా గుర్తించి, అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 279, 290, 294, 336, 337 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసభ్య కార్యకలాపాలకు వినియోగించిన స్కూటరుపై రూ.80వేల భారీ జరిమానా విధించారు. ఈ స్కూటర్‌పై నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈనెల 25నే మరో రూ. 47,500 జరిమానా విధించారు.

Advertisement

Next Story

Most Viewed