కరోనా కలవరం.. 40 శాతం పెరిగిన కేసుల సంఖ్య

by sudharani |
కరోనా కలవరం.. 40 శాతం పెరిగిన కేసుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో మరోసారి కరోనా మహామ్మారి ఆందోళనకు గురిచేస్తోంది. 24 గంటల వ్యవధిలో అమాంతంగా 40 శాతం పెరిగి 3,016కి చేరాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తరువాత ఈ స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా నమోదైంది. తాజా వివరాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 13,509కి చేరాయి.

ఇక రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతం. ఇక కేరళలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 8 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 14 మంది మరణించినట్టు కేంద్రం ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ భరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులు పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed