NEET: నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. లీకేజీకి బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ కీలక నేత డిమాండ్

by Ramesh N |   ( Updated:2024-06-20 10:36:48.0  )
NEET: నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. లీకేజీకి బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ కీలక నేత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెడిక‌ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ (నీట్-యూజీ 2024) అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రం ఆలోచించాలన్నారు. పేపర్ లీక్‌లను అడ్డుకోవడంలో ప్రధాని మోడీ విఫలం చెందారని ఆయన విమర్శించారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లుగా పరిస్థితి ఉందన్నారు. సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యలేనని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందన్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదని, వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story