Yogi Adityanath: మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తాం

by GSrikanth |   ( Updated:2022-08-09 07:10:31.0  )
UP CM Yogi Adityanath Receives Death Threat Message On Police WhatsApp
X

దిశ, వెబ్‌డెస్క్: UP CM Yogi Adityanath Receives Death Threat Message On Police WhatsApp| ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపింది. సీఎం అంతు చూస్తామని ఏకంగా లక్నో పోలీస్ హెల్ప్ నెంబర్‌కు ఆగస్ట్ 2న వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 3 రోజుల్లో ముఖ్యమంత్రిపై బాంబులు వేస్తామని సందేశంలో అగంతకులు బెదిరించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హెల్ప్‌లైన్ ఆపరేషన్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న పోలీసులు ఈ సందేశం పంపిందెవరనేది గుర్తిచే పనిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: అమానుషం.. హిందూ కుటుంబంపై పాకిస్తాన్‌లో దాడి (వీడియో)


Advertisement

Next Story