మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన!.. భార్య బీజేపీకి ఓటు వేసిందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

by Ramesh Goud |   ( Updated:2024-06-25 15:21:43.0  )
మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన!.. భార్య బీజేపీకి ఓటు వేసిందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి ఓటు వేసినందుకు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఓ భార్య ఆరోపిస్తున్న ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాననే ఇలా చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చింద్వారా లో ఉంటున్న ఆ మహిళకు 8 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యిందని, పెళ్లి అయిన దగ్గరి నుంచి అత్త, ఆడపడుచు ఏదో ఒక కారణంతో తనని కొట్టేవారని తెలిపింది. వారు ఇంటి నుంచి గెంటేయడంతో గత ఏడాదిన్నర కాలంగా భర్తతో బయట అద్దెకు ఉంటున్నానని తెలిపింది. అయితే తన ఇష్టానికి వ్యతిరేఖంగా బీజేపీకి ఓటు వేశానని, ఈ విషయం భర్త తల్లి, సోదరిమణులకు తెలియడంతో ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఈ విషయంలో భర్త మాత్రం తనకు ఎఫైర్స్ ఉన్నాయని.. ఇదే విషయంపై తరచూ గొడవ జరుగుతుండేదని తెలిపాడు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం మారుతుందని పలు మార్లు అవకాశం ఇచ్చినా.. మార్పు రాలేదని వాపోయాడు. అంతేగాక పార్టీకి మద్దతు ఇస్తోందనేది ట్రిపుల్ తలాక్ చెప్పడానికి కారణం కాదని, తన భార్యే తిరిగి తనని బెదిరింపులకు గురి చేస్తోందని అన్నాడు. అంతేగాక తన పరువు బజారుకు ఈడ్చే ప్రయత్నాలు చేస్తోందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. దీనిపై కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ ఉమేష్ గోల్హాని మాట్లాడుతూ.. కొంత కాలంగా వారి మధ్య బంధం సాదారణంగానే ఉందని, దీనిపై మహిళ ఫిర్యాదు మేరకు తన భర్త, అత్త, నలుగురు ఆడపడుచులపై వరకట్న నిషేద చట్టం, ముస్లిం మహిళ చట్టం సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed