బోరు నుంచి బయటపడ్డ బంగారం పొడి.. భారీగా తరలివెళ్లిన జనం

by Hamsa |
బోరు నుంచి బయటపడ్డ బంగారం పొడి.. భారీగా తరలివెళ్లిన జనం
X

దిశ, వెబ్ డెస్క్: బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నా కానీ ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒడిశాలో బోరులోంచి బంగారం పొడి వచ్చి అందరికీ షాక్‌కు గురిచేసింది.

వివరాల ప్రకారం.. ఒడిశాలోని బొలంగీర్ జీల్లాలో చంచన బహాలి గ్రామంలో బోరు తవ్వించగా అందులోంచి రెండు రోజులు మట్టితో పాటు బంగారం పొడి బయటకు వచ్చింది. ఈ విషయం చుట్టు పక్కల గ్రామ ప్రజలకు తెలిసి చూడడానికి బహాలి ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరును సీజ్ చేశారు. అంతేకాకుండా అది బంగారమా వేరే ధాతువా అని మట్టి నమూనాలతో పరిశోధనలకు పంపించి టెస్ట్ చేయిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed