చంద్రుడిపైకి తొలి భారత వ్యోమగామి వెళ్లేందుకు టైమ్ ఫిక్స్.. శాస్త్రవేత్తలకు మోడీ కీలక సూచన

by Satheesh |   ( Updated:2023-10-17 11:43:24.0  )
చంద్రుడిపైకి తొలి భారత వ్యోమగామి వెళ్లేందుకు టైమ్ ఫిక్స్.. శాస్త్రవేత్తలకు మోడీ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయ వ్యోమగామిని పంపే లక్ష్యంతో పని చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 2035 లోగా అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్‌ను సైతం నిర్మించాలని కోరినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అక్టోబర్ 21న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గగన్ యాన్ మిషన్‌కు చెందిన మాడ్యూల్‌ను ఇస్రో పరీక్షించబోతున్నది. ఈ నేపథ్యంలో గగన్ యాన్ మిషన్ సంసిద్ధతపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా భారత దేశం చేపట్టబోయే భవిష్యత్ రోదసీ కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ సైంటిస్టులకు దిశానిర్దేశం చేశారు. వీనస్, మార్స్ గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed