- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా’ అని ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన వైద్యుడు.. చివరికి ఏమైదంటే..?
దిశ, ఫీచర్స్: సాధారణంగా మనకి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన హాస్పిటల్ కి వెళ్తాము. కానీ, ఈ ఘటన వైద్య వృత్తికి మచ్చతెచ్చేలా ఉంది. ఎందుకంటే, ఆపరేషన్ థియేటర్‌లో ఓ రోగికి సర్జరీ చేస్తూ.. ఆపరేషన్ మధ్యలోనే ఆపేసి.. బయటకు వచ్చేశాడు. మళ్లీ రెండు గంటల తర్వాత వెళ్లి, సర్జరీ పూర్తి చేశాడు. సర్జరీ తర్వాత కూడా నయం కాకపోవడంతో మరో వైద్యుడిని సంప్రదించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
ఓ ఆర్థోపెడిక్ సర్జన్ కాజల్ శర్మ అనే బాలిక చేతికి సర్జరీ చేయాలని చెప్పారు. అదేరోజు ఆపరేషన్ చేసేందుకు బాలికను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ మొదలు పెట్టిన కొద్దీ సేపటికే ఆకలిగా ఉందని, దోశ తిన్న తర్వాత సర్జరీ పూర్తి చేస్తానని చెప్పి మధ్యలోనే వైద్యుడు వెళ్లిపోయాడు. అంతే అలా వెళ్లిపోయిన డాక్టర్ దాదాపు 2 గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. అయినా కూడా బాలిక చెయ్యి సెట్ కాలేదు. వేళ్లు కూడా వంకరగా మారడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ వైద్యుడిని కలిసేందుకు ప్రయత్నించగా .. వారిని కలిసేందుకు ఆ డాక్టర్ ఇష్టపడలేదు. దీంతో చేసేదిలేక ఆ బాలిక మరో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవల్సి వచ్చింది.
దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు వైద్యుడిపై నవాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో జిల్లా ఐపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తామని మీడియాకు తెలిపారు.