CM కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. సీబీఐ కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

by Satheesh |
CM కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. సీబీఐ కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మద్యం పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన ఈడీ కేసులో చివరి నిమిషంలో బెయిల్ నిలిచిపోగా.. తాజాగా సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో జూలై 12 దాకా కేజ్రీవాల్ జైలులో ఉండనున్నారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్‌ను అధికారులు తీహార్ జైలుకు తరలిస్తు్న్నారు.

కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. కస్టడీ గడువు ముగియడంతో అధికారులు ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఈడీ కేసులో లాస్ట్ మినిట్‌లో బెయిల్ నిలిచిపోగా.. తాజాగా సీబీఐ కేసులో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలు నుండి కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు

Next Story

Most Viewed