మంత్రిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

by Anjali |
మంత్రిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మెహతో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 56 ఏళ్ల మెహతో గురువారం ఉదయం మరణించారు. నవంబర్ 2020లో కోవిడ్ బారిన పడిన తర్వాత జగన్నాథ్ మెహతో ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడి మరణాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరించారు. ఇది ‘కోలుకోలేని నష్టం. మా టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు. ఈ రోజు జార్ఖండ్ ఒక గొప్ప ఉద్యమకారుడిని, పోరాట యోధుడిని, కష్టపడి పనిచేసే ప్రజాదరణ కలిగిన నాయకుడిని కోల్పోయింది. జగన్నాథ్ మెహతో చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయిన వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, ఈ కష్ట సమయాన్ని భరించే శక్తిని ఆ కుటుంబానికి ప్రసాదించాలి’అని ఆయన ఆకాంక్షించారు. కాగా, గిరిదిహ్‌లోని డుమ్రీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మెహతో గతనెలలో రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో అనారోగ్యం పాలవడంతో ఆయనను వెంటనే విమానంలో చెన్నైకి తరలించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed