- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిగా సహకరిస్తున్నాం.. ఐటీ సర్వేపై బీబీసీ రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐటీ శాఖ దాడులపై బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ) స్పందించింది. అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పరిస్థితి త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ప్రెస్ కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన వారాల తర్వాత ఐటీ అధికారుల చర్యలు సంచలనంగా మారాయి. మంగళవారం ఇండియాలోని బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి.
అయితే ఈ సోదాలపై ఐటీ అధికారులు సైతం స్పందించారు. ఇది తనిఖీలు కాదని సాధారణ సర్వే మాత్రమే అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ సర్వేపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులను అప్రకటిత ఎమర్జెన్సీగా వర్ణించింది. తొలుత బీబీసీ డాక్యుమెంటరీ విడుదలైందని ఆ తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందని ఇప్పుడు బీబీసీఐ ఐటీ దాడులు మొదలుపెట్టారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
ఇక ఈ ఇష్యులో ప్రభుత్వ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను గుర్తు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ విమర్శపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తప్పు చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. బీజేపీ ప్రతినిధి కౌరవ్ భాటియా మాట్లాడుతూ బీబీసీ ప్రపంచంలోనే అత్యంత అవినీతితో కూడిన సంస్థ అని తీవ్ర ఆరోపణలు చేసింది. బీబీసీ చేస్తున్న దుష్ప్రచారం కాంగ్రెస్ అజెండాకు చక్కగా సరిపోతుందని ఫైర్ అయ్యారు.