- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే..ఆప్ నేత సంజయ్ సింగ్ వెల్లడి
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి చేసింది నిజమేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో భిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలవడానికి మలివాల్ అక్కడికి వెళ్లారు. డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉండగా..భిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అంతేగాక దాడికి సైతం పాల్పడ్డాడు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. దీనిని కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. స్వాతి మలివాల్ దేశం కోసం నిరంతరం పని చేస్తారని కొనియాడారు. ఈ సమయంలో ఆప్ ఆమెకు అండగా ఉంటుందని చెప్పారు. కాగా, భిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడగా తాజాగా ఆప్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. అయితే భిభవ్ పై స్వాతి ఫిర్యాదు చేయనట్టు పోలీసులు తెలిపారు.