పాఠశాల బాగు చేయాలని కోరిన 3వ తరగతి బాలిక.. వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించిన మోదీ!

by Anjali |
పాఠశాల బాగు చేయాలని కోరిన 3వ తరగతి బాలిక.. వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించిన మోదీ!
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన మూడవ తరగతి చదువుతోన్న ఓ బాలిక(సీరత్ నాజ్).. తమ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు లేవని.. తమ స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ విద్యార్థి వీడియో ద్వారా ప్రధానికి తెలిపింది. ‘‘అస్సలామ్ వాలేకుమ్ మోదీజీ. కైసే హో ఆప్... ఆప్ సబ్ కీ బాత్ సుంతే హో, మేరీ భీ బాత్ సునో (నమస్కారం మోదీ గారు మీరు ఎలా ఉన్నారు? మీరు అందరూ చెప్పే మాట వింటారు కదా. దయచేసి నా మాట కూడా వినండి) అంటూ మాట్లాడింది.

ఈ వీడియో చూసిన జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం వెంటనే ‘రిమోట్ లోహై-మల్హర్’ బ్లాక్‌లో ఉన్న ఆ ప్రభుత్వ పాఠశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మను కలిసి చర్చించారు. గతంలోనే ఈ బడి కోసం రూ.91 లక్షలతో ప్రాజెక్టు మంజూరయ్యిందని.. అడ్మినిస్ట్రేషన్ అనుమతులకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల పనులు ఆగిపోయాయనని చెప్పారు. కాగా సమస్యలేంటో తెలుసుకొని వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. కాగా.. పాఠశాలలో పునరుద్దరణ పనులు మొదలైన నేపథ్యంలో సీరత్ నాజ్ మరో వీడియో రిలీజ్ చేసింది.

‘‘మోదీ సార్ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు. నేను బాగున్నాను. మీ వల్ల మా స్కూల్ పనులు ప్రారంభమయ్యాయి. మా స్కూల్‌ను కొత్తగా చేస్తున్నారు. ధన్యవాదాలు మోదీసార్. మాకు బెంచీలు, డెస్క్‌లు కూడా వచ్చినప్పుడు నేను మళ్ళీ పెద్ద థ్యాంక్స్ చెబుతాను మీకు. ఇకపై మేమందరం గోనెపట్టపై కూర్చోవాల్సిన అవసరం లేదు. మా పాఠశాల భవనం కూడా పూర్తయిపోయింది. టాటా సార్.. లవ్ యూ ’’ అంటూ ఆ బాలిక తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed