Thailand : భారతీయులకు ఈ-వీసాను ప్రకటించిన థాయ్‌లాండ్

by Hajipasha |
Thailand : భారతీయులకు ఈ-వీసాను ప్రకటించిన థాయ్‌లాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతీయుల(Indians)కు థాయ్‌లాండ్(Thailand) గుడ్ న్యూస్ వినిపించింది. జనవరి 1 నుంచి భారతీయులకు ఈ-వీసాను మంజూరు చేస్తామని ప్రకటించింది. గతంలో భారతీయ పర్యాటకులకు ఇచ్చిన 60 రోజుల వీసా మినహాయింపును యధాతథంగా ఇకపైనా కొనసాగిస్తామని వెల్లడించింది.

ఈ-వీసాను పొందేందుకు వీసా ఫీజును ఆఫ్‌లైన్ పేమెంట్ పద్ధతిలోనూ చెల్లించవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చని పేర్కొంది. ఈమేరకు న్యూఢిల్లీలోని రాయల్ థాయ్‌లాండ్ ఎంబసీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed