- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Terrorist Killed: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా(Kupwara)లో భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్(Ak Rifle), 2 హ్యాండ్ గ్రెనేడ్లు (hand grenades), నాలుగు మ్యాగజైన్లు (magazines), మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లోలాబ్ అటవీ ప్రాంతంలో (Lolab Area) ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆర్మీ అధికారులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదికి, సైన్యానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందినట్టు చెప్పారు. ఉగ్రవాది హతమవ్వడంతో ఈ ప్రాంతంలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అంతకుముందు బందిపొరా జిల్లాలోనూ ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
కాగా, జమ్మూ కశ్మీర్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. గత నెలలో గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కంపెనీకి చెందిన ఆరుగురు కార్మికులు, స్థానిక వైద్యుడిని ఉగ్రవాదులు హతమార్చారు. అనంతరం బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్‌లోని బోటపత్రి ప్రాంతంలో ఉగ్రవాదులు ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఇద్దరు పోర్టర్లను హతమార్చారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లోనూ ఉగ్రదాడి జరిగింది. శ్రీనగర్‌లోని మార్కెట్‌పై జరిగిన దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. దీంతో తరచూ ఉగ్రదాడులు జరుగుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.