- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీగా గెలిచిన బావగారు బాగున్నారా హీరోయిన్..
దిశ, డైనమిక్ బ్యూరో: ఒక్కప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రచన బెనర్జీ ఎంపీగా గెలిచి రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటోలో ఉన్న రచనా బెనర్జీ వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందింది. తొలి ప్రయత్నంలోనే బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై విజయం సాధించి వార్తల్లో నిలిచింది. బెంగాలీలో దాదాపు 200 వరకు చిత్రాల్లో నటించిన రచన ఓడియాలోనూ ఎక్కువ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ నటించింది.
తెలుగులో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రచన ఎక్కువగా నటించారు. రచన బెనర్జీ అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవితో బావగారు బాగున్నారా, బాలకృష్ణతో సుల్తాన్ వంటి సినిమాలతో పాటు కన్యాదానం, పిల్లనచ్చింది, ఎస్పీ కృష్ణారెడ్డి అభిషేకం మూవీస్‌లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది. అయితే, తెలుగులో చివరగా లాహిరి లాహిరిలో సుమన్ సరసన నటించిన తర్వాత తన సొంత రాష్ట్రంలో టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మరోసారి వార్తల్లో నిలిచింది. కాగా, గతంలోనూ తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ రానా.. మహారాష్ట్రలో అమరావతికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమె ఈసారి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నవనీత్‌పై కాంగ్రెస్ అభ్యర్ధి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.