Call Drop: కాల్ డ్రాప్స్ పై యూజర్ అసహనం.. కేంద్రం చర్యలు

by Shamantha N |
Call Drop: కాల్ డ్రాప్స్ పై యూజర్ అసహనం.. కేంద్రం చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాల్‌ మాట్లాడుతుండగా కట్‌ అవుతుందని (call drop) తరచూ సెల్‌ఫోన్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదు వస్తోంది. ఇటీవల ఈ ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తుండడంతో కేంద్ర టెలికాం శాఖ (Telecom Ministry) చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా 2025 ఏప్రిల్‌ నుంచి ఈ సమస్యను ప్రతి నెల సమీక్షించనున్నట్లు ఆ శాఖ తెలిపింది. ప్రస్తుతం మూడు నెలలకోసారి సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా కాల్‌ క్వాలిటీ చెక్‌.. మునుపటిలా టవర్‌ వద్ద కాకుండా స్మార్ట్‌ఫోన్‌ వద్దే చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

నెట్ వర్క్ ఇష్యూ..

అయితే, నెట్‌వర్క్‌ ఇష్యూ, మౌలిక సదుపాయాల కొరత, సిగ్నల్‌ లేకపోవడం కారణాలతో కాల్స్‌ కట్టవుతున్నయి. దీంతో, టెలికాం కంపెనీలపై యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, కనెక్టివిటీని పెంపొందించేందుకు కొత్తగా దేశవ్యాప్తంగా 26వేల గ్రామాలకు సేవలందేలా 27 వేల టవర్లను నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్న మోసాల కట్టడికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీఐయూ)ను ఏర్పాటు చేసింది

Advertisement

Next Story

Most Viewed