Technical Problem: ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. కువైట్ ఎయిర్‌పోర్టులో భారతీయుల అవస్థలు

by Shiva |
Technical Problem: ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. కువైట్ ఎయిర్‌పోర్టులో భారతీయుల అవస్థలు
X

దిశ, వెబ్‌డెస్క్: యూకే (UK)లోని మాంచెస్టర్ ఎయిర్‌పోర్టు (Manchester Airport) నుంచి ముంబై (Mumbai)కి ఆదివారం రాత్రి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు, పొగ రావడంతో సిబ్బంది ఫ్లైట్‌ను కువైట్‌ ఎయిర్‌పోర్టు (Kuwait Airport)లో ఆకస్మికంగా నిలిపివేశారు. దీంతో ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు ఫుడ్, వసతి కల్పించాలని అక్కడున్న ఎయిర్‌పోర్టు సిబ్బందిని అడగ్గా.. ఈయూ (EU), యూకే (UK), యూస్ (US) పాస్‌పోర్టులు ఉంటేనే ఆహారం, వసతి కల్పిస్తామని సమాధానం ఇచ్చారు. భారత్ (India), పాకిస్థానీ (Pakistan)లకు ట్రాన్సిట్ వీసా (Transit Visa) లేదని కువైట్ ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో భారత ప్రయాణికులు ఫ్లైట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Next Story

Most Viewed