Sabarmati Report: పార్లమెంటులో సబర్మతి రిపోర్టు మూవీ వీక్షించనున్న మోడీ

by Shamantha N |
Sabarmati Report: పార్లమెంటులో సబర్మతి రిపోర్టు మూవీ వీక్షించనున్న మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ‘ది సబర్మతి రిపోర్ట్‌’ (The Sabarmati Report) మూవీ వీక్షించనున్నారు. పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియం (Bal Yogi Auditorium) ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ కు ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) సహా పలువురు సభ్యులు హాజరుకానున్నారు.

గోద్రా అల్లర్లు

కాగా, 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్ లో అల్లర్లు చెలరేగాయి. గోద్రా నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు కదలుతుండగా ఎవరో చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపై రాళ్లు రువ్వారు. కొందరు దుండగులు బోగీపై పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టారు. దీంతో, ఆ బోగీలోని 59 మంది చనిపోయారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను తెరకెక్కించారు. విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే, ఈ సినిమాపై ప్రధాని మోడీ సహా పలువురు ప్రశంసలు కురిపించారు.

Advertisement

Next Story

Most Viewed