- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UI teaser : ఉపేంద్ర ‘యూఐ’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదల.. ఆకట్టుకుంటోన్న హీరో డైలాగ్!
దిశ, వెబ్‌డెస్క్: ఉపేంద్ర(Upendra) స్వీయదర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొస్తున్న తాజా చిత్రం ‘యూఐ’(UI). డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కె. పి. శ్రీకాంత్(K. P. Srikanth) అండ్ జి. మనోహరన్(G. Manoharan) నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్(Ajanish Loknath) సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ మూవీలో రీష్మ ననైయ(Reeshma Nanaiya), జిషు సేన్‌గుప్త(Jishu Sengupta), సన్నీ లియోన్(Sunny Leone), మురళీ శర్మ(Murali Sharma) పలువురు నటీనటులు ముఖ్యపాత్రల్లో మెరవనున్నారు. ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న ఈ సినిమా ఈ నెల (డిసెంబరు)20 వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచారు. 2024 లో ప్రపంచం ఎలా ఉంటుందో ఈ టీజర్‌లో చూపించారు. పెద్ద ఎత్తున గొడవలు.. ఆకలి కోసం ప్రజలు పడుతోన్న కష్టాలు, టీజర్ చివర్లో ‘మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ’ అని హీరో చెప్పిన డైలాగ్ తో టీజర్ అదిరిపోయింది. ఇక ఉపేంద్ర ‘యూఐ’ టీజర్ సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.