Sajjala Bhargav: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

by Rani Yarlagadda |
Sajjala Bhargav: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, వైఎస్ జగన్ సర్కారులో సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుమారుడు అయిన సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy)కి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టుల విషయంలో తనపై నమోదైన కేసుల్ని కొట్టి వేయాలని సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై ఏపీ హైకోర్టు (AP High Court)లోనే పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. కాగా.. రెండు వారాలపాటు సజ్జల భార్గవ్ ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అరెస్ట్ నుంచి భార్గవ్ కు రక్షణ కల్పించడంతో.. భారీ ఊరట దక్కినట్లయింది. కానీ.. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అన్నది హైకోర్టే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

సజ్జల భార్గవరెడ్డి టీడీపీ (TDP) నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పోస్టుల్ని పరిశీలించిన తర్వాత.. ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా పోస్టులన్నీ ఆమోదయోగ్యంగా లేవని, సీరియస్ గా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

పులివెందుల (Pulivendula)లో సజ్జల భార్గవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. భార్గవరెడ్డి సహా మరో ఇద్దరిపై సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఇటీవలే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కూడా భార్గవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed