- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూసేకీ అగ్గిరవ్వమాదిరి ఉంటాడే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసిన శ్రష్టి వర్మ.. వీడియో వైరల్
దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోలో కంటెస్టెంగ్‌గా అడుగుపెట్టి నేడు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగిన శ్రష్టి వర్మ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈమె ఢీ షోనుంచి బయటికి వచ్చాక కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ కింద పని చేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్ సరసన ‘యథా రాజా తథా ప్రజా’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు డ్యాన్స్ మాస్టర్‌గా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ సినిమాలో టైటిల్ సాంగ్ అయినటువంటి.. ‘పుష్ప పుష్ప’ అనే పాటకు విజయ్ పోలకితో పాటు శ్రష్టి కూడా కొరియోగ్రఫీ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పుష్ప-2 సినిమాలో సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే సాంగ్ ఎంతగా హైలెట్‌గా నిల్చిందో మనందరికీ తెలిసింది. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అని తేడా లేకుండా ఈ పాటకి అందరూ స్టెప్పులేశారు. అయితే ఈ పాటను గణేష్ మాస్టర్ కంపోజ్ చేయగా, శ్రష్టి వర్మ దీనికి అసిస్టెంట్ కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. ఇక ఈ సాంగ్‌కు శ్రష్టి వర్మ గతంలో రిహార్సల్ చేసిన డ్యాన్స్ వీడియోను తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే స్టెప్పులతో ఈ బ్యూటీ అదరగొట్టింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈమె వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.