- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త జెర్సీల్లో టీమిండియా ప్లేయర్లు
దిశ, స్పోర్ట్స్ : టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సర్వం సిద్ధం చేయగా.. జూన్ 2 నుంచి అధికారికంగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు విడతల వారీగా ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. తాజాగా ఐసీసీ తన అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్‌లో టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలను ధరించి దిగిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, శివమ్ దూబే, బస్ప్రిత్ బుమ్రాలు కొత్త జెర్సీల్లో తలుక్కుమన్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. టీమిండియా కొత్త జెర్సీల కలర్ కాంబినేషన్ చాలా బాగుందని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరగనుండగా.. జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో టీమిండియా జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది.