Tamil Nadu : కోరుకున్న చోటుకే మూడేళ్లు పోస్టింగ్.. మహిళా పోలీసులకు గుడ్‌న్యూస్

by Hajipasha |
Tamil Nadu : కోరుకున్న చోటుకే మూడేళ్లు పోస్టింగ్.. మహిళా పోలీసులకు గుడ్‌న్యూస్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహిళా పోలీసులకు తమిళనాడు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇస్తున్న 9 నెలల ప్రసూతి సెలవులను ఏడాదికి పెంచింది. ఈమేరకు సీఎం ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి విధుల్లో చేరిన మహిళా పోలీసులకు.. వారి తల్లిదండ్రులు లేదా భర్త స్వగ్రామంలో ఎంపిక చేసుకున్న ప్రకారం మూడేళ్ల పాటు పోస్టింగ్‌ను కేటాయిస్తామని తమిళనాడు సీఎం వెల్లడించారు. మూడేళ్ల పాటు కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం లభిస్తే.. వారి నవజాత శిశువుల పెంపకం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పోలీసు శాఖ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story