- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Stalin: రాజకీయంగా ఎదుర్కోలేకే ఈడీ దాడులు.. తమిళనాడు సీఎం స్టాలిన్
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఫైర్ అయ్యారు. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం స్టాలిన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. విపక్షాలను రాజకీయంగా, సైద్ధాంతికంగా, ఎన్నికల పరంగా ఎదుర్కోలేకే బీజేపీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించారు. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలపై దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకమై ఈ మోడల్ ను బీజేపీ దేశమంతా అనుసరిస్తోందని అన్నారు.
ఒకే స్క్రిప్టును దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ అక్కడి ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని మనీ లాండరింగ్ ఆరోపణలో నేపథ్యంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అనారోగ్య కారణాలతో బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించిన మంత్రికి అక్కడ చుక్కెదురైంది.