ప్రధాని మోడీలో ఓటమి భయం కనిపిస్తోంది.. CM స్టాలిన్ సెటైర్

by GSrikanth |
ప్రధాని మోడీలో ఓటమి భయం కనిపిస్తోంది.. CM స్టాలిన్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం స్టాలిన్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ సీఎ కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడమే కారణమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని సెటైర్ వేశారు. తమిళనాడు ప్రజల అభివృద్ధిని ప్రధాని ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో 20 స్థానాల్లో అధికార డీఎంకే పోటీ చేస్తుండగా.. 10 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. సీపీఎం, సీపీఐకి చెరో రెండేసి స్థానాలు చొప్పున కేటాయించారు. మిగిలినవి కూటమి పార్టీలకు కేటాయించారు.

Advertisement

Next Story