చెన్నైలో ఎన్ కౌంటర్.. తమిళనాడు BSP చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు హతం

by Satheesh |
చెన్నైలో ఎన్ కౌంటర్.. తమిళనాడు BSP చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్మ్ స్ట్రాంగ్‌ మర్డర్ కేసులో కీలక నిందితుడైన రౌడీ షీటర్ తిరువేంగఠం పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. కస్టడీ నుండి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడు. కాగా, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ మర్డర్ తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇంట్లో ఉన్న అతడిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన తమిళనాడు పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపడంతో ఆర్మ్‌స్ట్రాంగ్ మర్డర్ కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రౌడీ షీటర్ తిరువేంగఠంను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోలీసు కస్టడీ నుండి తిరువేంగఠం తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా తిరువేంగఠం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed