Mpox Outbreak: స్వీడన్‌లో మొదటి మంకీపాక్స్ కేసు నమోదు

by S Gopi |
Mpox Outbreak: స్వీడన్‌లో మొదటి మంకీపాక్స్ కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ వైరస్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన ఒకరోజు తర్వాత స్వీడన్ తన మొదటి మంకీపాక్స్ కేసు నమోదైనట్టు గురువారం ప్రకటించింది. దీంతో ఆఫ్రికా ఖండం వెలుపల మంకీపాక్స్ వైరస్ కేసు నమోదైన మొదటి దేశంగా నిలిచింది. ఆ దేశంలోని స్టాక్‌హోమ్‌లో ఓ వ్యక్తి క్లాడ్1 వేరియంట్ వల్ల వచ్చే మంకీపాక్స్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. క్లాడ్1 వల్ల ఆఫ్రికా ఖండం బయట నిర్ధారించిన మొదటి కేసు ఇదేనని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ఎపిడెమియాలజిస్ట్ మాగ్నస్ గిస్లెన్ ప్రకారం, ఆఫ్రికాలోని సందర్శనకు వెళ్లినప్పుడు సదరు వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. మంకీపాక్స్ కొత్త క్లాడ్, పొరుగుదేశాల్లోనూ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. కాంగో, ఆఫ్రికాలోని ఇతర దేశాలలో పాక్స్ క్లాడ్‌ల వ్యాప్తిపై, ఈ వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ స్పందన అవసరమని స్పష్టమైంది' అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed