డీసీడబ్ల్యూని పట్టించుకోవట్లేదు- కేజ్రీవాల్ కు స్వాతి మలివాల్ లేఖ

by Shamantha N |
డీసీడబ్ల్యూని పట్టించుకోవట్లేదు- కేజ్రీవాల్ కు స్వాతి మలివాల్ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ లేఖ రాశారు. తాను గ‌త‌ జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. దాన్ని మెల్ల‌మెల్ల‌గా అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోపించారు. ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత స‌వాళ్ల‌ను ఆమె ఎత్తి చూపారు. క‌మిష‌న్ బ‌డ్జెట్‌ను ఏక‌ప‌క్షంగా కోత‌లు విధించిన‌ట్లు తెలిపింది. తన రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం తనని నిరుత్సాహపరిచిందన్నారు. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం దారుణమని.. ఇప్పుడు దాన్ని మూసివేశారని ఆరోపించారు. కమిషన్‌కు నిధుల నిలిపివేశారని.. బడ్జెట్ తో కోత విధించారని, సిబ్బందిని తొలగించారని అన్నారు. డీసీడబ్ల్యూని ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేయడాన్ని ఆపాలని సీఎం కేజ్రీవాల్‌ను కోరారు.

ఖాళీగా డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ పోస్టు

డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ పోస్టు ఖాళీగా ఉందని.. కమిషన్ ను సక్రమంగా పనిచేయడానికి అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు. కనీసం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కమిషన్ లో చోటు కల్పించాలనే నిబంధనను పాటించట్లేదన్నారు. గత 8 ఏళ్లుగా తన బృందంతో కలిసి కమిషన్ ను కష్టపడి నిర్మించామన్నారు. దానికి ఫలితమే దేశంలో అత్యంత సమర్థవంతమైన మహిళా కమిషన్ అవతరించిందన్నారు. రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు(కేజ్రీవాల్‌).. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకమని అన్నారు. సీఎం, మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని మ‌హిళ‌లు, పిల్ల‌ల‌ను ఆదుకోవాలని వేడుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

Next Story