రాహుల్ గాంధీ వదులుకునే MP సీటుపై వీడిన సస్పెన్స్.. తేల్చేసిన CWC..?

by Satheesh |
రాహుల్ గాంధీ వదులుకునే MP సీటుపై వీడిన సస్పెన్స్.. తేల్చేసిన CWC..?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాల నుండి బరిలోకి దిగారు. కేరళలో తన సిట్టింగ్ స్థానమైన వయనాడ్ నుండి మరోసారి బరిలోకి దిగిన రాహుల్.. దీంతో పాటుగా ఉత్తరప్రదేశ్‌లో తమ ఫ్యామిలీకి కంచుకోటైనా రాయ్ బరేలి స్థానం నుండి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ లేదా రాయ్ బరేలి ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రాహుల్ ఏ సీటును వదలుకుంటారని దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలోనూ ఈ అంశంపై డిస్కషన్ జరిగినట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీగా వీక్‌గా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీని కేరళలోని వయనాడ్ స్థానానికి రాజీనామా చేసి గాంధీ ఫ్యామిలీకి పెట్టని కోటైనా రాయ్ బరేలి నుండి ప్రాతినిధ్యం వహించాల్సిందిగా సీడబ్ల్యూసీ సూచించినట్లు తెలుస్తోంది. యూపీలోని రాయ్ బరేలి నుండి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తే కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్‌తో పాటు పార్టీ పునర్నిర్మాణంపైన ఆయన ఫోకస్ పెట్టవచ్చని సీడబ్ల్యూసీ నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

వయనాడ్ కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనకు మొదట అసంతృప్తి వ్యక్తం చేయగా.. సీడబ్ల్యూసీ మెంబర్స్ సూచనతో సెలైంట్ అయినట్లు సమాచారం. దీంతో రాహుల్ వయనాడ్‌కు గుడ్ బై చెప్పి.. రాయ్ బరేలి నుండి ఎంపీగా కొనసాగునున్నట్లు టాక్. దీనిపై ఏఐసీసీ మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ అనే కొత్త ప్రశ్న తలెత్తింది. అయితే, వయనాడ్ బై పోల్‌లో గాంధీ ఫ్యామిలీ నుండి కాకుండా కేరళకు చెందిన కాంగ్రెస్ నేతనే బరిలోకి దింపాలని ఏఐసీసీ యోచిస్తోన్నట్లు సమాచారం. మరీ ఈ అంశంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story