Fake Alert: వామ్మో.. నకిలీ ENO ప్యాకెట్లు ఉన్నాయా? ఫ్యాక్టరీ గుట్టురట్టు

by Ramesh N |
Fake Alert: వామ్మో.. నకిలీ ENO ప్యాకెట్లు ఉన్నాయా?  ఫ్యాక్టరీ గుట్టురట్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కడుపులో మంట.. అసిడిటీకి ఉపశమనం లభిస్తోందని ENO ప్రోడక్ట్ యాడ్ అందరికీ తెలిసిందే. అయితే ఈనోను కొంతమంది దుండగులు నకిలీవి తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సూరత్‌లో స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నకిలీ ఈనో తయారు చేస్తున్న ఫ్యాక్టరీని ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నవీపర్డి గ్రామంలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ENO బ్రాండ్‌ను పోలిన మెషినరీ, ప్యాకేజింగ్ మెటీరియల్‌ని గోదామలో ప్యాకింగ్ చేస్తుండగా ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టకున్నారు.

తదుపరి విచారణలో పోలీసులు పినల్ రెసిడెన్సీలోని ఓ ఇంటికి వెళ్లారు. అక్కడ వారు నకిలీ ఈనో ప్రొడక్ట్, మంగళదీప్ అగర్బత్తీలు, వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్‌ల పెట్టెలను కనుగొన్నారు. ఈ ప్రదేశంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ENO ప్యాకింగ్ రోల్స్, ఈనో పౌడర్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, సెల్లో టేప్ రోల్స్, 17,340 నింపిన ఈనో పౌచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నెట్ వర్క్, ఇప్పటివరకు ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ విక్రయించడం లాంటివి చేశారా? పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే వెంటనే ఇది తాగుతారు. కానీ మార్కెట్లో దొరికే ENO నకిలీవి చాలా ఉన్నాయ్ అని ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story