NEET Row: రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్తారా?

by Shamantha N |
NEET Row: రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్తారా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. దేశంలోని పరీక్షా విధానంపై రాహుల్ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని మండిపడ్డారు. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా.. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు. “దేశంలోని పరీక్షా విధానాల్లో మోసం జరుగుతుందని రాహుల్ ఆరోపిస్తూ వచ్చారు. దేశంలోని విద్యావ్యవస్థ పరువు తీయాలనుకుంటున్నారా?.. కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజీలు జరిగాయి. ఇప్పుడు ఆయన ఇలా దేశాన్ని ఎందుకు అవమానిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు, ప్రతిపక్ష నాయకుడి పదవిని అగౌరవ పరిచారు. తాను చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్తారా?” అని రవిశంకర్ ప్రశ్నించారు.

నీట్ విషయంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

సుప్రీంకోర్టు సంవత్సరాల ఫలితాలను పరిశీలించిందని, పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసిందన్నారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పిచ్చిందన్నారు. ఇప్పటికైనా రాహుల్ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఇకపోతే, మే 5న నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ ఆరోపణలు వచ్చినప్పటినుంచి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. పార్లమెంటులోనూ ఇదే రచ్చ నడుస్తోంది. అయితే, నీట్‌ పరీక్షను రద్దు చేసేందుకు మంగళవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. హజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీక్ జరిగిందని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed