Delhi Liquor Policy Case: మనీష్ సిసోడియా బెయిల్ అప్పీల్‌పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

by S Gopi |
Delhi Liquor Policy Case: మనీష్ సిసోడియా బెయిల్ అప్పీల్‌పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు ఏడాదిన్నర కాలంగా జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. 2023, ఫిబ్రవరిలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అరెస్టయినప్పటి నుంచి సిసోడియా జైల్లో ఉన్నారు. అనేకసార్లు ఆయన జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడం జరిగింది. మనీష్ సిసోడియా సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు దర్యాప్తు సంస్థలూ దాఖలు చేసిన కేసులను ఎదుర్కొంటున్నారు. మే 21న ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిసోడియా తన పదవిని దుర్వినియోగం చేశారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు బెయిల్ నిరాకరణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆగస్టు 6న సిసోడియా అప్పీల్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, విచారణ ముగియడానికి ఎంత సమయం పడుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడిగిన తర్వాత తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. జూన్ 4వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సిసోడియా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ కోరినప్పుడు, జూలై 3లోగా తుది ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఈడీ చెప్పిందని న్యాయమూర్తులు తెలిపారు.

Advertisement

Next Story