‘ది కేరళ స్టోరీ’ నిషేధంపై సుప్రీం స్టే..

by Vinod kumar |   ( Updated:2023-05-18 14:21:38.0  )
‘ది కేరళ స్టోరీ’ నిషేధంపై సుప్రీం స్టే..
X

న్యూఢిల్లీ: వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లభించినందున చిత్ర ప్రదర్శన సందర్భంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత బెంగాల్ ప్రభుత్వానిదే అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బెంగాల్ లో ఆ చిత్ర విడుదలకు మార్గం సుగమమైంది. తమిళనాడులో కూడా భద్రతా కారణాల రీత్యా సినిమా ప్రదర్శనకు థియేటర్ యజమానులు నిరాకరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

సినిమా బాగా లేకపోతే ఎలాగూ జనాలు చూడరని, ప్రదర్శనను నిలిపివేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే.. కేరళలో 32 వేల మంది మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేర్చారన్న తప్పుడు వాదనను తొలగించాలని చిత్ర నిర్వాహకులను ఆదేశించింది. దీంతో దీన్ని ముగ్గురు యువతుల కథగా మారుస్తామన్నారు. సినిమాను ప్రదర్శిస్తే మత విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందంటూ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని తమ రాష్ట్రాల్లో విడుదల చేయకుండా అడ్డుకున్నాయి.

Also Read...

Krithi Shetty :అందం కోసం ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి

Advertisement

Next Story

Most Viewed