- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
COVID 19 : కొవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై ‘పిల్’ కొట్టివేత
దిశ, నేషనల్ బ్యూరో : కొవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకున్న వారు శరీరంలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలను ఎదుర్కొన్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రియామిశ్రా, పలువురు దాఖలు చేసిన ఈ పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సంచలనం కోసమే ఈ పిల్‌ను దాఖలు చేసినట్లు స్పష్టమవుతోందని, దీన్ని తాము విచారించలేమని బెంచ్ స్పష్టం చేసింది.
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా అర్ధం చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ పిటిషన్ దాఖలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని వారిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కొవిడ్-19 వాక్సిన్ తీసుకున్నారా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించగా.. తీసుకున్నానని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్ కలిగాయా అని అడగగా.. అలాంటిదేమీ లేదని న్యాయవాది బదులిచ్చారు.